మరోసారి పోలీస్ గా నాగ్ ?

Tuesday,November 26,2019 - 12:20 by Z_CLU

మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు నాగార్జున. ‘మన్మథుడు 2’ తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న నాగ్ నెక్స్ట్ సోలోమాన్ అనే దర్శకుడితో సినిమా చెయబోతున్నాడు. ఇందులోనే నాగ్ గంట నిడివి గల పోలీస్ క్యారెక్టర్ చేయనున్నాడని సమాచారం.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జనవరి నుండి రెగ్యులర్ షూట్ మొదలు కానున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మించనున్నాడని టాక్ వినబడుతుంది. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.