ఇప్పట్లో నాగ చైతన్యతో సినిమా లేదు

Thursday,January 19,2017 - 02:30 by Z_CLU

ఓ వైపు ఓం నమో వెంకటేశాయ, మరోవైపు రాజుగారి గది ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న నాగార్జున హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్న రూమర్  కి చెక్ పెట్టేశాడు. ప్రస్తుతం ఓం నమో వెంకటేశాయ సినిమా ప్రీ ప్రొడక్షన్, ప్రమోషన్ ప్లాన్స్ లో బిజీగా ఉన్న మన్మధుడు మరీ కోపంగా కాదు కానీ, కూల్ గానే క్లారిటీ ఇచ్చేశాడు.

శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగేశ్న కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగార్జున, రేపో మాపో నాగచైతన్య తో సెట్స్ పైకి వచ్చేస్తున్నాడని, ఆ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడనే న్యూస్ ఒక్కసారిగా అటు సోషల్ మీడియాతో పాటు, న్యూస్ చానల్స్ కూడా కన్ఫం చేసేశాయి.

ఈ న్యూస్ నిజం కాదని కొట్టి పారేసిన నాగార్జున, ఈ న్యూస్ నాక్కూడా న్యూసే అని ట్వీట్ చేశాడు. ఓం నమో వెంకటేశాయ తరవాత ఇమ్మీడియట్ గా ఓంకార్ డైరెక్షన్ లో ‘రాజు గారి గది’ సీక్వెల్ సెట్స్ పైకి వచ్చే ఆలోచనలో ఉన్నాడు నాగ్.