రెండు సినిమాలు రెడీ చేస్తున్న నాగ్

Sunday,September 16,2018 - 04:30 by Z_CLU

ఇటివలే ‘దేవదాస్’ షూటింగ్ ఫినిష్ చేసాడు నాగ్… ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ అనే హిందీ సినిమాతో పాటు ధనుష్ తో ఓ తమిళ్ సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు తెలుగులో తన నెక్స్ట్ సినిమాలపై  ఫోకస్ పెట్టాడు.. ‘సోగ్గాడే చిన్ని నాయన’ కు సీక్వెల్ గా ‘బంగార్రాజు’ కథ రెడీ చేయిస్తున్న నాగ్ ఈ సినిమాతో పాటు ‘మన్మధుడు 2’ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ ‘బంగార్రాజు’ సినిమాకి కథ రెడీ చేసే పనిలో ఉండగా రాహుల్ రవీంద్రన్ ‘మన్మధుడు2’ స్సిప్ట్ వర్క్ చేస్తున్నాడు.. రెండు కథలు రెడీ అవ్వగానే నాగ్ కి వినిపించనున్నారు దర్శకులు.

ఈ సినిమాలకు సంబంధించి పూర్తి కథ విన్నాక అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అనౌన్స్ చేయనున్నాడు నాగ్.. సో ప్రస్తుతం స్క్రిప్ట్ స్టేజిలో ఉన్న ఈ సినిమాలకు సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ రానుంది.