ప్రీ ప్రొడక్షన్ లో నాగార్జున -నాని మల్టీ స్టారర్ సినిమా

Tuesday,October 03,2017 - 04:40 by Z_CLU

కింగ్ నాగార్జున – నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో ఓ మల్టీస్టార్ సినిమా తెరకెక్కనుందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను అశ్వనీదత్ నిర్మించనున్నాడనే వార్త కూడా వినిపిస్తుంది..లేటెస్ట్ ఈ సినిమా వార్తపై క్లారిటీ ఇచ్చేశాడు నాగార్జున..

నానితో చేయబోయే సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఉంటుందని, శ్రీరామ్ చెప్పిన పాయింట్ బాగా నచ్చిందని, ప్రస్తుతం ఆ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని.. జనవరి నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని తెలిపాడు నాగ్.

నిన్నటి వరకూ వార్తగానే ఉన్న ఈ మల్టీస్టారర్ సినిమా ఇప్పుడు నాగ్ కంఫర్మేషన్ తో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసిపోయింది. ఇటీవలే కార్తీ తో ఊపిరి సినిమా చేసి అందులో ఓ డిఫరెంట్ రోల్ తో ఎంటర్టైన్ చేసిన  నాగ్ మరి ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడో.. వీరిద్దరూ కలిసి ఎలా ఎంటర్టైన్ చేస్తారో..చూడాలి.