నాగార్జున ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Tuesday,January 31,2017 - 08:44 by Z_CLU

‘అన్నమయ్య’, ‘శ్రీ రామదాసు’, ‘షిరిడి సాయి’ తర్వాత నాగార్జున-రాఘవేంద్ర రావు కాంబినేషన్ తెరకెక్కిన భక్తి రస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ . ఈ సినిమా ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్బంగా మీడియా తో మాట్లాడాడు నాగార్జున. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

 

అన్నమయ్య గుర్తుకు రాదు

ఈ సినిమా కి ‘అన్నమయ్య’ కి కామన్ వెంకటేశ్వర స్వామి మాత్రమే. అన్నమ్మయ్య కి ఈ కథ కి చాలా డిఫరెన్స్  ఉంటుంది. ‘అన్నమాచార్య’ ఈజ్ ఏ జీనియస్. తన జీవితాన్ని రచనలతో వెంకటేశ్వర స్వామి కి అంకితం ఇచ్చారు. హాథీ రామ్ బాబాదొక డిఫరెంట్ చరిత్ర. ఆ కథ కి ఈ కథ కి ఎలాంటి సంబంధం ఉండదు. సినిమా చూస్తున్నంత సేపు అన్నమయ్య అస్సలు గుర్తుకు రాదు.

 

ఆయన గురించి చాలా తక్కువ తెలుసు

నిజానికి హాథీరాం బాబా గారి గురించి మాకు  తెలిసింది తక్కువే.  ఆయన గురించి చరిత్ర కూడా తక్కువే ఉంది. ఆయన నార్త్ నుంచి వచ్చారని ఆయనకి ఒక ఫామిలీ ఉందని, మరదలు కూడా ఉందని. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దేవుడిని వెతుకుతూ తిరుమలలో సెటిల్ అయిపోయారని, వెంకటేశ్వర స్వామి తో పాచికలు ఆడేవారని, ఆ తరువాత తిరుమల కు ఓ దివ్య భక్తుడిగా అప్పట్లో  మేనేజర్ గా చేసారని కొంచెం తెలుసు. ఆ తెలిసిన కాస్త చరిత్రతో ఒక కథను రెడీ చేసి నాకు వినిపించారు రాఘవేంద్ర రావు గారు భారవి గారు.. ఇంత మంచి భక్తుడి చరిత్రను కథగా మలిచి తెరకెక్కించినందుకు ఆ ఇద్దరికీ థాంక్స్ చెప్పాల్సిందే..

 

వాళ్ళు చెప్పేటప్పుడే అర్ధం చేసుకున్నా

ఈ సినిమా విషయం లో పెద్దగా హోమ్ వర్క్ లాంటివేం చేయలేదు. ఆయన ఎలా ఉండే వారు ఏం చేసే వారు అనేది రాఘవేంద్ర రావు గారు భారవి గారు చెప్తున్నప్పుడే ఏం చెయ్యాలి, ఎలా కనిపించాలి అనేది తెలుసుకున్నా..

har_2655

అనుష్క హీరోయిన్ కాదు

ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ కాదు ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే. ఒక విధంగా చెప్పాలంటే హాథీ రామ్ బాబా లాంటి ఓ క్యారెక్టర్ అనే చెప్పాలి.చిన్న తనం నుంచే వెంకటేశ్వర స్వామి కి మహా భక్తురాలై స్వామే నా సర్వస్వం అని భావించే కృష్ణమ్మ క్యారెక్టర్ చేసింది. ప్రగ్య నాకు మరదలిగా నటించింది.

 

ఎలాంటి రిఫరెన్స్ లేకుండా 

కీరవాణి గారు  ఆయన మ్యూజిక్ తో సినిమాకు ప్రాణం పోశారు. అన్నమయ్య కి కొన్ని లిరిక్స్ ఉన్నాయి. ఆయన రచనలు ఉన్నాయి. కానీ ఈ సినిమాకి ఆయనే ఓన్ చేసుకొని ట్యూన్స్ అందించి లిరిక్స్ రాయించుకొని,  ప్రత్యేకంగా గోవిందా నామాలు కూడా  క్రియేట్ చేసి ట్వేన్టాస్టిక్ అనిపించారు.

har_2644

*ఆ క్రెడిట్ వాళ్ళకే

ఈ సినిమా చూసాక ‘అన్నమయ్య’ సినిమా గుర్తుకు రాకుండా ఇంత ఫ్రెష్ సినిమా ఎలా తీసారని ఆడియన్స్ ఫీలవుతారు. ఆ క్రెడిట్ రాఘవేంద్ర రావు , భారవి గారికే చెందుతుంది..

 

*ఫ్యామిలీస్ థియేటర్స్ కు వస్తున్నారు

మొన్నటి వరకూ ఫ్యామిలీస్ థియేటర్స్ కు రావడం తగ్గించారు. కానీ లాస్ట్ ఇయర్ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి కానీ ‘ఊపిరి’ సినిమా గాని ఫామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి చూసారు. ప్రెజెంట్ ఫామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూడడం జరుగుతుంది. మళ్ళీ ఈ సినిమాకి కచ్చితంగా ఫామిలీ ఆడియన్స్ అందరు వస్తారని ఆశిస్తున్నా…

har_2635

*చాలా హ్యాపీ

లాస్ట్ ఇయర్ నుంచి హ్యాపీనెస్ ఎక్కువైంది. హిట్స్, ఫామిలీ  ఈవెంట్స్, నాగచైతన్య, అఖిల్ ఎంగేజ్ మెంట్ వాళ్ళు కూడా హ్యాపీ. ఈ హ్యాపినెస్ ఇలాగే కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నా

 

*ఆ కథైతే వద్దని చెప్పా

భారవి గారు ఒక మంచి కథ ఉంది వినమని అన్నారు. ఈ విషయం మొన్న ఆడియో వేడుక లో కూడా చెప్పారు. అయితే భక్తి రస కథ కాక పోతే వింటా అని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడే అలాంటి సినిమా  చేసి మళ్ళీ చెయ్యాలంటే కష్టం కదా. అది కాదు మరో హిస్టారికల్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అని చెప్పారు వీలు చూసుకొని ఆ కథ వింటా..

 

*అలాగే ఉండాలని అనుకున్నాం

ఈ సినిమా కి వెంకటేశ్వర స్వామి గా ఎవరైతే బాగుంటారా, వెంకటేశ్వర స్వామి అనగానే యవ్వనంగా కనిపించాలి. కొన్ని క్వాలిటీస్ ఉండాలని చాలా టైం తీసుకున్నాం. అదే టైం లో సౌరబ్ అయితే బాగుంటుందని అందరం డిసైడ్ అయ్యి ఆయన నటించి కొన్ని ఎపిసోడ్స్ చూసి ఫిక్స్ అయ్యాము. మేం  అనుకున్నట్లే వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించాడు. రిలీజ్ తర్వాత ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు.

har_2649

*నా లెక్క ఒకటి ఫాన్స్ లెక్క ఒకటి

100 వ సినిమా ఎవరితో అని ఫాన్స్ అడుగుతున్నారు. నిజానికి నా లెక్క ఒకటి వాళ్ళ లెక్క ఒకటి. ఒక్క ఫ్రేమ్ లో కనిపించిన సినిమాలు కూడా లెక్కేస్తే ఎలా. వాయిస్ ఓవర్లు ఇచ్చాను అవి కూడా లెక్కేసేస్తున్నారు. ఆ లెక్క ఫైండ్ అవుట్ చేస్తా…

 

*అది నాకే న్యూస్

ఇటీవలే ‘శతమానం భవతి’ డైరెక్టర్ తో చేస్తున్నానని విన్నా, అది నాకే న్యూస్. ట్విట్టర్ లో కూడా పెట్టాను. ఏ ఫైనల్ అయినా నేనే ట్వీట్ చేస్తా…

 

*ఈ సినిమా రిలీజ్ అయ్యాకే

చందు మొండేటి కూడా ఒక కథ చెప్తున్నాడు మొన్నే ఒక సారి ఆ కథ గురించి కూర్చున్నాం. మళ్ళీ కూర్చుందామని అనుకున్నాం. ఈ సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ ఆ కథ వింటా..

 har_2697

*మా బ్యానర్ లో మరో పాత్ బ్రేకింగ్ ఫిలిం

అఖిల్ సినిమాకి ఓ మూడు నాలుగు నెలల క్రితం ఒక కథ అనుకున్నాం. ఐడియా గా బాగుంది, కానీ కథ గా వర్కౌట్ అవ్వలేదు. విక్రమ్ మళ్ళీ ఇంకో పాయింట్ చెప్పాడు. ఆ కథ మీద ప్రెజెంట్ వర్క్ జరుగుతుంది. ఆ కథకి బిగినింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ మూడు వర్క్ ఫినిష్ అయ్యాయి. మిగతా వర్క్ జరుగుతుంది. ఫిబ్రవరి నెలాఖరుకి ఆ సినిమా గురించి డీటైల్స్ ఇస్తా…ఆ సినిమాకి  కేవలం నిర్మాత గా మాత్రమే వ్యవహరిస్తా.. ఆ సినిమా డిస్కర్షన్ జరుగుతున్నప్పుడు మా బ్యానర్ లో మరో పాత్ బ్రేకింగ్ ఫిలిం అవుతుందని అనిపిస్తుంది  .

 

* నిన్నే పెళ్లాడతా లాంటి సినిమా

నాగ చైతన్య-కళ్యాణ్ కృష్ణ సినిమా 50 శాతం షూటింగ్ ఫినిష్ అయింది. ఒక ఫామిలీ ఎమోషన్స్ తో లవ్ స్టోరీ తో తెరకెక్కుతుంది. ఒక ‘నిన్నే పెళ్లాడట’ లాంటి సినిమా. తన ప్రేమించిన అమ్మాయి  కోసం ఏమైనా చేసే క్యారెక్టర్ లో చైతు కనిపిస్తాడు. సినిమా  చాలా బాగా వస్తుంది. కచ్చితంగా  చైతన్య కెరీర్ లో ఓ మంచి ఫామిలీ ఎంటర్టైనర్ హిట్గా నిలుస్తుంది . మార్చ్ ఎండింగ్ వరకూ షూటింగ్ పూర్తవుతుంది. ఫైనల్ అవుట్ పుట్ చూసి  ఆ సినిమా కి ఏం చెయ్యాలో అన్నీ చేశాక  రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తా .

 

*ఆ రెండు సినిమాలే

ప్రస్తుతం ‘రాజు గారి గది’ తో పాటు ‘బంగార్రాజు’ సినిమా చేయాలను కుంటున్నా. ఇప్పటి వరకూ అవే ఫైనల్ చేశా..మిగతావి త్వరలోనే అనౌన్స్ చేస్తా…