Bangarraju - నాగ్ ప్లానింగ్ అదేనా?

Monday,December 28,2020 - 01:20 by Z_CLU

‘సోగ్గాడే చిన్ని నాయన’ గ్రాండ్ సక్సెస్ తర్వాత నాగ్, కళ్యాణ్ కృష్ణ దానికి బంగార్రాజు అనే సీక్వెల్ ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సంక్రాంతికే ఆ సీక్వెల్ రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఇంత వరకు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇప్పుడు ఆ సీక్వెల్ ను సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు నాగార్జున. వచ్చే నెలలో బంగార్రాజు రెగ్యులర్ షూట్ మొదలు పెట్టి జెట్ స్పీడులో పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారట.

ఈ సీక్వెల్ లో ఈసారి నాగ్ తో కలిసి నాగచైతన్య కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. విలేజ్ క్యారెక్టర్ కి చైతు ప్రిపేర్ అవుతున్నాడు. ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్స్ తో పాటు మిగతా క్యాస్టింగ్ కూడా ఫైనల్ చేసే పనిలో నాగ్ అండ్ కళ్యాణ్ ఉన్నారని సమాచారం. వచ్చే ఏడాది త్వరగానే షూటింగ్ పూర్తయినప్పటికీ 2022 సంక్రాంతి కే రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతుందట.

సో… సోగ్గాడు సెంటిమెంట్ తోనే మళ్ళీ సంక్రాంతికి ఈ సీక్వెల్ తో మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడు నాగ్.