షూటింగ్ అప్ డేట్స్
Tuesday,November 14,2017 - 01:09 by Z_CLU
అప్ కమింగ్ మూవీస్ షూటింగ్ తో టాలీవుడ్ స్టార్స్ బిజీబిజీగా ఉన్నారు. కొన్ని సినిమాలు యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉంటే, మరికొన్ని సాంగ్స్ తో పాటు సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాయి. వాటి లేటెస్ట్ అప్ డేట్స్ ఇవే…

సాయి ధరమ్ తేజ్ – V. V. వినాయక్
సాయిధరమ్ తేజ్ వినాయక్ ల సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఓల్డ్ సిటీలోని చార్మినార్ దగ్గర షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యూనిట్, సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉంది. C. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయిధరం తేజ్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.

సవ్యసాచి
నాగచైతన్య, చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సవ్యసాచి’ చిలుకూరులో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. వారం రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో నాగచైతన్య, నిధి అగర్వాల్, కమెడియన్ సత్య కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ తెరకెక్కించే పనిలో ఉంది సవ్యసాచి టీమ్. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.

రంగస్థలం
రామ్ చరణ్ ‘రంగస్థలం’ ప్రస్తుతం హైదరాబాద్ లోని భూత్ బంగ్లాలో షూటింగ్ జరుపుకుంటుంది. రామ్ చరణ్, సమంతాలపై కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్న ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. సుకుమార్ డైరెక్టర్.

అఖిల్
అఖిల్ ‘హలో’ ప్రస్తుతం హైదరాబాద్ లోని గండిపేటలో సాంగ్ షూటింగ్ జరుపుకుంటుంది. ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కళ్యాణి హీరోయిన్ గా నటిస్తుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజర్. ఈ సినిమాకు నాగార్జున ప్రొడ్యూసర్.