ఫినిషింగ్ టచ్ ఇస్తున్న నాగచైతన్య

Sunday,May 06,2018 - 03:28 by Z_CLU

గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం నాగచైతన్య స్టయిల్. ఒక సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమా స్టార్ట్ చేస్తాడు. ప్రస్తుతమైతే ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. ఓవైపు సవ్యసాచి సినిమా చేస్తూనే, మరోవైపు మారుతి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఇప్పుడు సవ్యసాచిని ఓ కొలిక్కి తీసుకొచ్చాడు చైతూ

సవ్యసాచి ఆఖరి షెడ్యూల్ న్యూయార్క్ లో మొదలైంది. ప్రస్తుతం నాగచైతన్య, హీరోయిన్ నిధి అగర్వాల్ మధ్య ఓ సాంగ్ తీస్తున్నారు. దీంతో పాటు చైతూ, నిధి, వెన్నెల కిషోర్, షకలక శంకర్ మధ్య మరికొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. దీంతో ఈ మూవీ టోటల్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది.

ఈ సినిమాలో భూమిక, మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.