జస్ట్ 15 రోజుల ముందు ఆగిన సినిమా

Tuesday,July 28,2020 - 12:34 by Z_CLU

లాక్ డౌన్ కారణంగా ఆఖరి నిమిషంలో ఆగిపోయిన పెద్ద సినిమాగా మిగిలిపోయింది ‘V’. సేమ్ ఇదే టైపులో ఆఖరి నిమిషంలో షూటింగ్ ఆగిపోయిన సినిమాగా నిలిచింది ‘లవ్ స్టోరీ’. అవును.. కాస్త లేటుగా లాక్ డౌన్ పడినట్టయితే ఈ సినిమా కంప్లీట్ అయ్యేది. ఈ పాటికి ఫస్ట్ కాపీ కూడా రెడీ అయ్యేదేమో.

సరిగ్గా గుమ్మడికాయ కొట్టడానికి కొన్ని రోజుల ముందు ‘లవ్ స్టోరీ’ సినిమా ఆగిపోయిందంటున్నాడు ఆ సినిమా నిర్మాత. 15 రోజులు టైమ్ దొరికితే సినిమా మొత్తం (ప్యాచ్ వర్క్ తో సహా) కంప్లీట్ అయ్యేదని, ఇప్పుడా 15 రోజుల షూట్ కోసం 3 నెలలుగా ఎదురుచూస్తున్నామంటున్నాడు.

‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ లాంటి సినిమాలకు పెండింగ్ వర్క్ చాలా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ 70శాతం కంప్లీట్ అయితే.. ‘ఆచార్య’ 40శాతం మాత్రమే కంప్లీట్ అయింది. కానీ ఇలా జస్ట్ 2 వారాల్లో షూట్ కంప్లీట్ అవుతుందనగా అగిపోయిన పెద్ద సినిమా ‘లవ్ స్టోరీ’ మాత్రమే.

మళ్లీ ఎప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందో నిర్మాతలు కూడా చెప్పలేకపోతున్నారు.