Love Story - వినాయక చవితి కానుకగా విడుదల

Wednesday,August 18,2021 - 11:59 by Z_CLU

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరి’ రిలీజ్ రెడీ అవుతుంది. రిలీజ్ వరకు వచ్చి సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమాకు సంబందించి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం కొత్త రిలీజ్ డేట్ తో సోషల్ మీడియాలో ‘లవ్ స్టోరి’ హంగామా చేస్తుంది.

షూటింగ్ స్టేజి నుండే ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇటివలే రిలీజయిన ‘సారంగ దరియా’ సాంగ్ సరికొత్త రికార్డు వ్యూస్ అందుకొని సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్న సినిమా కావడం పైగా అందులో భానుమతిగా సినిమాకు హైలైట్ గా నిలిచిన సాయి పల్లవి ఇందులో కూడా హీరోయిన్ గా నటించడంతో ఈ ప్రాజెక్ట్ పై ట్రేడ్ లో కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని మరో ఇరవై రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యూజికల లవ్ స్టోరి గా తెరకెక్కిన ఈ సినిమాతో పవన్ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తెలంగాణా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాగ చైతన్య డాన్స్ కొరియోగ్రాఫర్ గా నటిస్తున్నాడు. సినిమాకు చైతు -సాయి పల్లవి లవ్ ట్రాక్ మెయిన్ హైలైట్ అవ్వనుందని ఇన్సైడ్ టాక్. త్వరలోనే టీం ప్రమోషన్స్ మొదలు పెట్టి సినిమాపై మరింత క్రేజ్ తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics