Love Story - రిలీజ్ ఎప్పుడు?

Tuesday,September 15,2020 - 12:43 by Z_CLU

కొన్ని కాంబినేషన్ సినిమాలపై అంచనాలు తార స్థాయిలో ఉంటాయి. అలాంటి అంచనాలతో ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమానే ‘Love Story’. ఫిదాతో బ్లాక్ బస్టర్ అందుకున్న Sekhar Kammula-Sai Pallavi కాంబోలో తెరకెక్కుస్తున్న ఈ సినిమాకు Naga Chaitanya మరో ప్లస్ పాయింట్. ఈ ముగ్గురి కలయికలో రానున్న ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చే రోజు కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

లాక్ డౌన్ కి ముందే ఆల్మోస్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకుంది ‘లవ్ స్టోరి’. బ్యాలెన్స్ షూట్ ను ప్రస్తుతం పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది యూనిట్. చకచకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ లేదా జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అక్టోబర్ నుండి ఎలాగో థియేటర్స్ ఓపెన్ కానున్నాయి కాబట్టి డిసెంబర్ లో ఓ డేట్ ఫిక్స్ చేసుకొనే ప్లానింగ్ లో ఉన్నారు.

ఒక వేళ డిసెంబర్ లో కుదరకపోతే సంక్రాంతి కి మాత్రం సినిమా రిలీజ్ అవ్వడం ఖాయం. నారాయణ దాస్ నారంగ్ , రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు పవన్ సంగీతం అందిస్తున్నాడు.