రామ్ డైరెక్టర్ తో నాగ చైతన్య సినిమా ?

Sunday,February 03,2019 - 12:13 by Z_CLU

ప్రస్తుతం ‘మజిలీ’ సినిమాలో నటిస్తున్న నాగ చైతన్య… ఈ సినిమా ఫినిష్ అవ్వగానే ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్ కి షిఫ్ట్ కానున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత శశి అనే కొత్త దర్శకుడితో దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాను కూడా  లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేసుకున్నాడట చైతు. ప్రవీణ్ సత్తారు చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేసాడని తెలుస్తోంది. ఈ సినిమా కామాక్షి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనుందని సమాచారం.

మొన్నా మధ్య రామ్ తో ప్రవీణ్ సత్తారు ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే… గ్రాండ్ గా లాంచ్ అయిన ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.అయితే ఇప్పుడు అదే సినిమాను చైతూతో తెరకెక్కించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.