Thursday,August 27,2020 - 01:29 by Z_CLU
విక్రమ్ కుమార్ (Vikram Kumar) దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చైతూ. దీనికి Thank You అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో Horror ఎలిమెంట్స్ ఉన్నాయట. ఇప్పటివరకు నాగచైతన్య టచ్ చేయని జానర్ ఇది. మరి సినిమాలో హారర్ ఉందని తెలిసి కూడా చైతూ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో ఆయనకే తెలియాలి.
అసలు ఈ సబ్జెక్ట్ లో హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అనే విషయంపై ముందుగా యూనిట్ క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతానికైతే ఎక్కువమంది ఇందులో హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయనే చెబుతున్నారు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు చైతూ. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే విక్రమ్ కుమార్ సినిమా మొదలవుతుంది.