చైతూ కొత్త సినిమా టైటిల్ ఇదే

Thursday,July 02,2020 - 01:37 by Z_CLU

ప్రస్తుతం శేఖర్ కమ్ములతో ‘లవ్ స్టోరి’ సినిమా చేస్తున్న నాగచైతన్య నెక్స్ట్ సినిమాను విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో చేయబోతున్నాడు. ఇటివలే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘థాంక్యూ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మించనున్న ఈ సినిమాకు ప్రస్తుతం క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు విక్రమ్. అలాగే లోకేషన్స్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నాడు. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

మరి ఈ టైటిల్ పెట్టి చైతూతో విక్రమ్ ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి. ఈ సినిమా తర్వాత పరశురాం డైరెక్షన్ లో ‘నాగేశ్వరావు’ సినిమా చేస్తాడు చైతు.