#NC20... డైరెక్టర్ ఎవరంటే?

Saturday,April 18,2020 - 01:40 by Z_CLU

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్న నాగ చైతన్య నెక్స్ట్ సినిమాను కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. నిజానికి చైతు తన 20 సినిమాను పరశురాం డైరెక్షన్ లో చేయాల్సి ఉంది. అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కానీ పరశురాం అనుకోకుండా మహేష్ సినిమాకు షిఫ్ట్ అవ్వడంతో ఇప్పుడు విక్రం కుమార్ తో సినిమా ప్లాన్ చేసుకున్నాడట చైతు.

గతంలో విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఫ్యామిలీతో కలిసి ‘మనం’ సినిమా చేశాడు చైతు. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నాడని టాక్. లేటెస్ట్ గా నానితో ‘గ్యాంగ్ లీడర్’ తీసిన విక్రమ్ కుమార్… చైతు కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసి నాగ్, చైతు ల నుండి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నాడట.

లాక్ డౌన్ అవ్వగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమా నిర్మిస్తాడట.