నాగచైతన్య ‘సవ్యసాచి’ ట్రైలర్ రివ్యూ

Wednesday,October 24,2018 - 03:30 by Z_CLU

నాగ చైతన్య ‘సవ్యసాచి’ ట్రైలర్ రిలీజయింది. 1:39 సెకన్ల ట్రైలర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది. ఈ సినిమాలో నాగ చైతన్య ఎడమ చెయ్యి, తన మాట కూడా వినకుండా డెసిషన్స్ తీసుకోవడం కొత్త పాయింటే అయినా, ఈ విషయం సినిమా అనౌన్స్ చేసినప్పుడే రివీల్ చేసేశారు మేకర్స్. అయితే ట్రైలర్ లో మాత్రం నెగెటివ్ షేడ్స్ లో ఉన్న మాధవన్ కి, నాగచైతన్య మధ్య ఉండబోయే పవర్ ప్యాక్డ్ కెమిస్ట్రీ ని ఎలివేట్ చేశారు మేకర్స్.

సినిమాలో హ్యాప్పీగా సాఫీగా సాగుతున్న నాగచైతన్య లైఫ్ లో సడెన్ గా వచ్చి పడ్డ తుఫాన్ ఏంటి..? అసలు మాధవన్ కి నాగ చైతన్యకి ఉండబోయే కనెక్టివిటీ ఏమై ఉంటుందనే క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది ట్రైలర్. హీరో చేసే చిన్న చిన్న పనులకు లెఫ్ట్ హ్యాండ్ సహకరించకపోవడం అనేది సినిమా ఫస్టాఫ్ లో ఉండబోయే కామిక్ పాయింట్ అయితే, అదే చెయ్యి టఫ్ టైమ్ లో హీరోకి ఎలా సహకరించింది అనేది సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కానుంది.

“మీది పద్మవ్యూహమే సర్… కానీ అతను అభిమన్యుడిలా కాదు, అర్జునుడిలా ఉన్నాడు..’ అనే డైలాగ్ తో పాటు ‘చావైనా నిన్ను చేరాలంటే అది నీ ఎడమ చేయి దాటుకుని రావాలి అనే డైలాగ్స్, హీరో క్యారెక్టరైజేషన్ ని ఎలివేట్ చేస్తున్నాయి.

చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. భూమిక సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. కీరవాణి మ్యూజిక్ కంపోజర్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.