నాగ చైతన్య సవ్యసాచి షురూ అయింది

Wednesday,November 22,2017 - 12:45 by Z_CLU

నాగచైతన్య సవ్యసాచి సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగచైతన్య లెఫ్ట్ హ్యాండ్ తన కంట్రోల్ లో ఉండదన్న విషయం ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయితే, ఈ సినిమాలో మాధవన్ కీ రోల్ ప్లే చేయడం సినిమాపై ఇంట్రెస్టింగ్ వైబ్ ని క్రియేట్ చేస్తుంది. మాధవన్ కూడా ఈ రోజు నుండే సెట్స్ పైకి వచ్చాడు.

చందూ మొండేటి డైరెక్షన్ లో అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గ నటిస్తుంది. కీరవాణి ఈ సినిమాకు మ్యాజిక్ కంపోజ్ చేస్యడం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.