పక్కా ప్లానింగ్...

Saturday,December 10,2016 - 09:00 by Z_CLU

డేట్ టైం ఫిక్స్ చేయలేదు కానీ పెళ్ళి మాత్రం గ్యారంటీ అని కన్ఫం చేసిన చైతు, సమంతా ఫ్యూచర్ ప్లానింగ్ ఏమో కానీ, సినిమా ప్లానింగ్ మాత్రం పక్కాగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ సినిమాతో బిజీగా ఉన్న చైతు, పెళ్ళి లోపు మ్యగ్జిమం సినిమాలను కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. ఇప్పుడు అదే టార్గెట్ సమంతా కూడా సెట్ చేసుకుంది.

నిన్న మొన్నటివరకు చైతుతో మ్యాగ్జిమం టైం స్పెండ్ చేసిన సమంతా, ఇప్పుడు ఫుల్ టైం ఫోకస్ కరియర్ పై పెట్టినట్టు తెలుస్తుంది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ త్వరలో అనౌన్స్ చేస్తానని రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న స్యామ్, న్యూ ఇయర్ కల్లా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.