చైతు సమంతా జోడీగా మరో లవ్ ఎంటర్ టైనర్

Thursday,March 16,2017 - 05:20 by Z_CLU

చైతు, స్యామ్ జోడీగా మరో మ్యాజికల్ ఎంటర్ టైనర్ కి గ్రౌండ్ వర్క్ నడుస్తుందా..? అంటే అవును అనే రెస్పాన్సే వస్తుంది సినీటౌన్ లో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కే చాన్సెస్ ఉన్నాయంటూ స్ప్రెడ్ అవుతున్న బజ్, మరోసారి టాలీవుడ్ లో రొమాంటిక్ సీజన్ ని క్రియేట్ చేస్తున్నాయి.

ఇప్పటి వరకు ఈ విషయంలో నాగార్జున కానీ నాగ చైతన్య కానీ ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే చేయలేదు కానీ, నాగార్జున ఈ రియల్ లైఫ్ లవ్ జోడీతో మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని ప్లాన్ చేస్తున్నాడనే టాక్ టాలీవుడ్ లో ఇప్పుడు ప్రతి సెంటర్ లోను వినిపిస్తుంది.

ఇంకా తమ పెళ్ళి డేట్ ఫిక్స్ కాని ఈ జంట ప్రస్తుతానికి ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీబిజీగా ఉన్నారు. ఈ టాక్ కానీ నిజమై ఈ కాంబో ప్రాక్టికల్ గా సెట్స్ పైకి వస్తే ఫ్యాన్స్ కి ఫెస్టివల్ సీజన్ బిగిన్ అయినట్టే.