రేపే లాంచ్ కానున్న నాగ చైతన్య కొత్తసినిమా

Friday,November 24,2017 - 02:55 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్   సినిమాలతో బిజీ బిజీగా కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు నాగచైతన్య.  ప్రస్తుతం చందూ మొండేటి డైరెక్షన్ లో సవ్యసాచి సెట్స్ పై ఉన్న నాగచైతన్య, మరో సినిమాని ట్రాక్ పై పెట్టనున్నాడు. మారుతి డైరెక్షన్ లో జనవరి 5 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాని రేపు మార్నింగ్ 11 గంటలకు రామా నాయుడు స్టూడియోస్ లో గ్రాండ్ గా లాంచ్ చేయనుంది సినిమా యూనిట్.

కాన్సెప్ట్ ఏదైనా ఎంటర్ టైన్ మెంట్ గ్యారంటీ ఫార్ములాతో దూసుకెళ్తున్న మారుతి డైరెక్షన్ లో నాగ చైతన్య కాంబినేషన్ అనగానే ఈ సినిమా పట్ల ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. స్క్రిప్ట్ ని ఆల్మోస్ట్ లాక్ చేసుకున్న సినిమా యూనిట్, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

 

నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమా సితార ఎంటర్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. అయితే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాతో ఎట్రాక్టివ్ ఆన్ స్క్రీన్ కపుల్ అనిపించుకున్న నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో మళ్ళీ జోడీ కట్టనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.