ఇంతకీ చైతు ‘రాజుగారి గది 2’ చూస్తాడా..? లేదా..?

Tuesday,October 10,2017 - 01:17 by Z_CLU

రాజు గారి గది 2 ఈ నెల 13 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే ఫ్యాన్స్ లో హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై, రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ క్రేజ్ పెరుగుతూనే ఉంది. నాగార్జున కరియర్ లోనే ఫస్ట్ టైమ్ హారర్ జోనర్ లో నటించడం, ఈ సినిమాపై ఈ రేంజ్ క్రేజ్ క్రియేట్ అవ్వడానికి ఒక రీజన్ అయితే, సమంతా పెళ్ళి తరవాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా కావడంతో న్యాచురల్ గానే ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది.

రాజు గారి గది 2 సినిమాలో సమంతా ఆత్మలా కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే జనరల్ గా హారర్  సినిమాలు చూడటం పెద్దగా ఇష్టపడని చైతు, ఈ సినిమాని కూడా చూడను అని చెప్పాడట. ఈ విషయం రీసెంట్ గా నాగార్జున ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేయడం జరిగింది. అయితే చైతు ఒపీనియన్ ఎలా ఉన్నా, ఓంకార్ మాత్రం చైతు ఈ సినిమా తప్పకుండా చూస్తాడని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

రాజుగారి గది 2 కంప్లీట్ హారర్ ఎంటర్ టైనర్ కాదు కాబట్టి, సినిమా రిలీజ్ అయ్యాక ఎలాగూ సినిమా టాక్ బయటికి వస్తుంది కాబట్టి చైతు డెఫ్ఫినేట్ గా ఈ సినిమా చూస్తాడు అని చెప్పుకున్నాడు ఓంకార్. ఫ్యామిలీ ఇమోషన్స్ ని హారర్ ఎలిమెంట్స్ ని బ్లైండ్ చేసిన ఫెంటాస్టిక్ ఎంటర్ టైనర్ ఈ సినిమా అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఓంకార్. మరి నాగ చైతన్య ఓంకార్ చెప్పినట్టు ఈ సినిమా చూస్తాడా లేదా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.