చైతు 'Love Story' చెప్పేది అప్పుడేనా?

Thursday,October 15,2020 - 02:33 by Z_CLU

Naga Chaitanya, Sai Pallavi తో Sekhar Kammula తెరకెక్కిస్తున్న ‘Love Story’ కి రిలీజ్ డేట్ ఫిక్సయింది. సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ద్వారా చెప్పబోతున్నారు.

సినిమాలో చైతూ, సాయిపల్లవి మధ్య వచ్చే లవ్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఎట్రాక్ట్ చేస్తాయని సినిమాలో లవ్ స్టోరి కి అందరూ కనెక్ట్ అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్.

ప్రస్తుతం సినిమాకు సంబంధించి బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసే పనిలో ఉన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. డాన్స్ నేపథ్యంలో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాను Narayan das Narang, Ram Mohan Rao నిర్మిస్తున్నారు. Pavan మ్యూజిక్ అందిస్తున్నాడు.