సవ్యసాచి సినిమాలో నాగచైతన్య లుక్ అదుర్స్

Wednesday,November 22,2017 - 02:57 by Z_CLU

సవ్యసాచి సినిమాలో నాగచైతన్య లుక్ రిలీజయింది. నాగ చైతన్య, సమంతాల పెళ్ళి తరవాత సెట్స్ పైకి వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమా చుట్టూ న్యాచురల్ గానే ఫోకస్ సెట్ అయి ఉంది. రేపు నాగ చైతన్య బర్త్ డే కావడంతో ఆల్ రెడీ సెలెబ్రేషన్స్ బిగిన్ చేసేసిన సినిమా యూనిట్, ఈ ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్   ని ఇంప్రెస్ చేసేసింది.

 

అల్టిమేట్ మాసివ్ లుక్ లో ఉన్న నాగచైతన్య ఈ సినిమాలో యాంగ్రీ యంగ్ స్టర్ లా కనిపించనున్నట్టు తెలుస్తుంది. చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాధవన్ కీ రోల్ ప్లే చేస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి  మూవీ  మేకర్స్  బ్యానర్  పై తెరకెక్కుతున్న  ఈ సినిమాకి  కీరవాణి  మ్యూజిక్ కంపోజ్ చేశాడు.