సాహసమే శ్వాసగా చైతూ...

Thursday,November 10,2016 - 01:39 by Z_CLU

ప్రస్తుతం నడుస్తున్న 500, 1000 రూపాయల నోట్లపై బ్యాన్ విధించడంతో ఈ వీకెండ్ రానున్న సినిమాల  విడుదలపై చాలా కన్ఫ్యూజన్ ఉంది. అల్లరినరేష్ నటించిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమాను ఇప్పటికే పోస్ట్ పోన్ చేయగా… మరిన్ని సినిమాలు వాయిదా బాట పడుతున్నాయి. కానీ నాగచైతన్య మాత్రం తన కొత్త సినిమా టైటిల్ కు తగ్గట్టు.. సాహసమే శ్వాసగా దూసుకుపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకుముందే చెప్పినట్టు తన నయా మూవీని రేపు థియేటర్లలోకి తీసుకొస్తున్నాడు.

నాగచైతన్య సినిమాలకు ఫ్యామిలీస్ అండ్ ఫిమేల్ ఫాలోయింగ్ ఎక్కువ. మరీ ముఖ్యంగా చైతూ సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్ చేయించుకున్న ఆడియన్సే ఎక్కువమంది. సో… 500, 1000 రూపాయల నోట్ల సమస్య ఎక్కువమందికి ఉండకపోవచ్చని నిర్మాతలు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రేమమ్ తో ఓవర్సీస్ మార్కెట్ పెంచుకున్న చైతన్యకు… ఆ సెక్షన్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. సో… సాహసం శ్వాసగా సాగిపో సినిమాను అనుకున్న టైమ్ కే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.