ప్రస్తుతం OTT కోసం కొందరు యంగ్ హీరోలు , హీరోయిన్స్ వెబ్ సిరీస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ లిస్టులో ఇప్పుడు నాగ చైతన్య కూడా చేరబోతున్నాడు. తాజాగా అమీర్ ఖాన్ సినిమాలో ఓ క్యారెక్టర్ చేసిన చైతు ఇప్పుడు మరో స్టెప్ ముందుకు వేసి సిరీస్ చేయబోతున్నాడు. అవును విక్రం కుమార్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ కథతో సిరీస్ చేయబోతున్నాడు చైతు. ఇటివలే విక్రం కుమార్ చెప్పిన నరేషన్ కి ఫ్లాట్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ప్రస్తుతం ఈ సిరీస్ కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసి ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నాడు విక్రం కె కుమార్. త్వరలోనే మొదటి సిరీస్ కి సంబంధించి షూట్ మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే ఓ OTT సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని అగ్రిమెంట్ రాసుకున్నారని తెలుస్తుంది. నాగ చైతన్య -విక్రం కుమార్ కాంబినేషన్ లో ‘మనం’ సినిమా వచ్చింది. తాజాగా వీరిద్దరూ మరోసారి ‘థాంక్యూ’ అనే సినిమా చేశారు. ఆ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది.
ఆ సెట్ లోనే చైతుకి ఈ సిరీస్ ఆలోచన చెప్పి స్క్రిప్ట్ నెరేట్ చేశాడని సమాచారం. మొదటి సినిమాను హారర్ జానర్ లో తీసి తనకంటూ ఓ గుర్తింపు అందుకున్నాడు విక్రం కుమార్. ఆ తర్వాత వివిధ జానర్స్ లో సినిమాలు చేశాడు. ఇప్పుడు మళ్ళీ హారర్ జానర్ లో సిరీస్ ప్లాన్ చేసుకున్నాడు. ఇలా చైతు -విక్రం కుమార్ ఒక సినిమా ఒక సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి వీటితో ఎలాంటి హిట్స్ అందుకుంటారో చూడాలి.
– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics