విభిన్నంగా సాగిపోతున్న చైతు

Wednesday,November 30,2016 - 10:54 by Z_CLU

జోష్ తో తెలుగు స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన చైతు కరియర్ లో రియల్ జోష్ నింపింది మాత్రం ‘ఏం మాయ చేశావే’ సినిమానే. ఈ సినిమాతో రైట్ ట్రాక్ తొక్కిన చైతు స్టోరీ సెలెక్షన్ లోనే కాదు, డైరెక్టర్స్ విషయంలోనూ ఆచి తూచి అడుగులు కదుపుతున్నాడు. మరీ ఒకే రకం జోనర్ కి స్టిక్ అవ్వకుండా, సినిమా సినిమాకి మధ్య డిఫ్ఫెరెన్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు.

గౌతమ్ మీనన్ తో సాహసం శ్వాసగా సాగిపో చేసిన నాగ చైతన్య, డిఫరెంట్ గా చందు మొండేటి తో ప్రేమమ్ చేశాడు. సోగ్గాడే చిన్న నాయనా లాంటి కలర్ ఫుల్ హిట్ నిచ్చిన కళ్యాణ్ కృష్ణ సినిమాతో ఆల్ రెడీ సెట్స్ పై ఉన్న ఈ హీరో ఇంద్రగంటి మోహన కృష్ణ, చంద్ర శేఖర్ యేలేటి లతో నెక్స్ట్ సినిమాలకు ఆల్ రెడీ కమిట్ అయ్యాడు.

కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో సినిమా డీటేల్స్ అయితే ప్రస్తుతానికి బయటికి రాలేదు కానీ సోగ్గాడే టైప్ ఎంటర్ టైనర్ ఖాయమని ఫ్యాన్స్ ఆల్ రెడీ డిసైడ్ అయిపోయారు. ఇక ఇంద్రగంటి మోహన కృష్ణ, చంద్ర శేఖర్ యేలేటి రూట్లే వేరు. చైతు ఇమేజ్ కి, వీళ్ళిద్దరూ తెరకెక్కించే సినిమాలకి అసలు సంబంధమే ఉండదు. దీన్ని బట్టి నాగ చైతన్య ఒక పర్టికులర్ ఇమేజ్ కి స్టిక్ అవ్వకుండా ఎప్పటికప్పుడు వేరియేషన్స్ మెయిన్ టైన్ చేస్తున్న విషయం ఈజీగా అర్థమైపోతుంది.