నాగభరణం మూవీ రివ్యూ..

Friday,October 14,2016 - 03:40 by Z_CLU

నటీ నటులు : విష్ణు వర్ధన్, రమ్య, దిగంత్, ముకుల్‌దేవ్, రవికాలే తదితరులు
సినిమాటోగ్రఫీ: వేణు,
సంగీతం: గురుకిరణ్
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సలావుద్దీన్ యూసఫ్, షబ్బీర్ హుస్సేన్.
సమర్పణ : జయంతి లాల్
నిర్మాతలు:  సాజిద్ ఖురేషి, దవల్‌గాడా, సొహైల్ అన్సారీ
రచన-దర్శకత్వం : కోడి రామకృష్ణ

అమ్మోరు, అరుంధతి వంటి విజువల్ వండర్స్‌ని రూపొందించిన శత చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం
‘నాగ భరణం’. మరి ఈ గ్రాఫిక్ వండర్ మునపటి సినిమాల రేంజ్ లో ఉందా… కోడి రామకృష్ణ మరోసారి తన మేజిక్ చూపించారా..? ప్రేక్షకులను  ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది ?

కథ :-

సూర్య గ్రహణం రోజు తమ శక్తి అంత కోల్పోతామని గ్రహించి  దేవుళ్లందరూ కలిసి తమ శక్తితో ఓ  శక్తివంతమైన ‘శక్తి కవచం’ సృష్టిస్తారు. లోకాన్ని అంతా కాపాడే  ఈ అతి శక్తివంతమైన శక్తికవచాన్ని తమ సొంతం చేసుకోవడానికి కోసం ఎన్నో దుష్ట శక్తులు ప్రయత్నిస్తాయి. అయితే ఆ దుష్ట శక్తుల నుంచి కవచాన్ని శివయ్య(సాయి కుమార్) కుటుంబం  తరతరాలుగా కాపాడుకుంటూ వస్తుంది. శివయ్య తరువాత ఆ శక్తి కవచాన్ని తమ కుటుంబం తరుపున కాపాడుకుంటూ వస్తున్న నాగమ్మ(రమ్య) ఒకానొక సందర్భంలో మరణించి మరో జన్మలో మానస గా పుట్టి ఆ శక్తి కవచం సుస్థిర స్థానంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ శక్తి కవచం ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారి దగ్గర ఉందని దానిని ఢిల్లీ మ్యూజిక్ కాంపిటీషన్ లో బహుమతి గా ఇస్తారని తెలుసుకున్న మానస…  నాగ్ చరణ్  (దిగంత్) అనే మ్యూజిషియన్ ద్వారా ఆ కవచాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తుంది.
ఈ క్రమంలో ఆ కవచాన్ని దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన విలన్స్ ను దుష్ట శక్తులను మానస ఎలా అంతం చేసింది? చివరికి శక్తి కవచాన్ని ఎలా కాపాడుకుంది? అనేది ఈ సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు :-

నాగమ్మ, మానస అనే రెండు విభిన్న పాత్రలతో తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది హీరోయిన్ రమ్య. ముఖ్యంగా క్లైమాక్స్ లో కన్నడ సూపర్ స్టార్ విష్ణు వర్ధన్  గ్రాఫిక్స్  ద్వారా బాగా అలరించాడు. ఇక యంగ్ మ్యుజీషియన్ గా దిగంత్ ఆకట్టుకున్నాడు. అమిత్, రాజేష్ వివేక్, సాధు కోకిల, రంగాయన రఘు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

telugu_poster_02
టెక్నీషియన్స్ పనితీరు :-

ఈ చిత్రానికి వర్క్ చేసిన టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే ముందుగా గ్రాఫిక్స్ టీం గురించే మాట్లాడుకోవాలి. సినిమాకి  విజువల్  ఎఫెక్ట్ బలాన్నిచ్చాయి. ముఖ్యంగా ఏడేళ్ల క్రితం మరణించిన కన్నడ సూపర్ స్టార్ విష్ణు వర్ధన్ ను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా చూపించడం సినిమాకు హైలైట్ గా నిలిచింది.
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కొన్ని సన్నివేశాలకు తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో గురుకిరణ్ ప్రాణం పోసాడనే చెప్పాలి. సంగీత ప్రాధాన్యం కూడా కలిగిన ఈ సినిమాలు పాటలు ఇంకాస్త ఆకట్టుకుంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. గ్రాఫిక్స్ తో అద్భుతాలు సృష్టించిన దర్శకుడు కోడి రామకృష్ణ… ఈసారి కేవలం విజువల్ ఎఫెక్ట్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపించింది.

telugu_poster_08
జీ సినిమాలు సమీక్ష :-

గతం లో ‘అమ్మోరు’, ‘దేవుళ్ళు’, ‘అరుంధతి’ వంటి విజువల్ ఎఫెక్ట్స్ చిత్రాలతో అలరించిన దర్శకుడు కోడి రామకృష్ణ ఈసారి కూడా ఆ యాంగిల్ లో నూటికి నూరు శాతం మార్కులు సంపాదించుకున్నారు. అయితే అమ్మోరు, అరుంధతి లాంటి సినిమాలకు గ్రాఫిక్స్ తో పాటు కథనం కూడా బ్యాక్ బోన్ గా నిలిచింది. నాగభరణం సినిమాకు మంచి కథ సెట్ అయింది. దాన్ని ఆకట్టుకునేలా చెప్పి ఉంటే, గ్రాఫిక్స్ బలంతో సినిమా మరో రేంజ్ లో ఉండేది. సినిమాను ఇంట్రెస్టింగ్ గా మొదలుపెట్టిన దర్శకుడు కనీసం ఇంటర్వెల్ బ్యాంగ్ వరకైనా ఆ బిగిని కొనసాగించి ఉంటే బాగుండేది. అయితే సెకెండాఫ్ లో మాత్రం దర్శకుడు తన అనుభవం చూపించాడు. సాయి కుమార్ ఫైట్, విష్ణు వర్ధన్ ఫైట్, విజువల్ ఎఫెక్ట్ తో కూడిన పాము సన్నివేశాలు, శివుడి మీద నుండి పాము వచ్చే సన్నివేశం మూవీకి హైలైట్స్ గా నిలుస్తాయి.
కథ, కథనాన్ని పక్కనపెడితే… గ్రాఫిక్స్ కోసమైనా ‘నాగభరణం’ సినిమాను ఓసారి చూడొచ్చు…