ఆత్మహత్యకు ట్రై చేసిన నాగబాబు

Thursday,August 20,2020 - 03:08 by Z_CLU

డిప్రెషన్ లోకి వెళ్లిపోతే ఎవరికైనా ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. నాగబాబుకు కూడా అలాంటి ఓ దుర్ఘటన ఎదురైంది. తను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఘటనను బయటపెట్టారు ఈ మెగాబ్రదర్.

ఓసారి కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ టూర్ కు వెళ్లారు నాగబాబు. ఆ టైమ్ లో ఓ మార్కెట్లో అనుకోకుండా నిహారిక తప్పిపోయిందట. దాదాపు కొన్ని గంటల పాటు ఆమె కనిపించలేదట. దీంతో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన నాగబాబు.. ఆ టైమ్ లో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు వెల్లడించారు.

నిహారిక అంటే తనకు ప్రాణమని, తను కనిపించకపోయేసరికి ఏం చేయాలో అర్థంకాలేదన్నారు నాగబాబు. వరుణ్ తేజ్ ను ఇంటికి పంపించేసి, భార్యతో కలిసి చనిపోవాలనే విషయాన్ని బయటపెట్టారు.

జీ తెలుగులో ఆగస్ట్ 23న టెలికాస్ట్ కాబోతున్న బాపు బొమ్మకు పెళ్లంట అనే స్పెషల్ ప్రొగ్రామ్ లో నాగబాబు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బయటపెట్టారు