త్రివిక్రమ్ శిష్యుడితో నాగశౌర్య సినిమా

Sunday,February 12,2017 - 12:43 by Z_CLU

జ్యో అచ్యుతానంద తర్వాత నాగశౌర్య చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఎన్ని స్టోరీలు విన్నప్పటికీ, ఎంతమంది దర్శకులు అప్రోచ్ అయినప్పటికీ.. నాగశౌర్య మాత్రం తన నెక్ట్స్ సినిమాను సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగా లాంగ్ గ్యాప్ తర్వాత వెంకీ అనే కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇంత గ్యాప్ తీసుకొని ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడానికి ఓ కారణం కూడా ఉంది.

స్టార్ డైైరక్టర్ త్రివిక్రమ్ దగ్గర వర్క్ చేశాడు వెంకీ. ఆ ఎక్స్ పీరియన్స్ తోనే ఓ అద్భుతమైన కథ రాసుకున్నాడు. ఆ కథ నాగశౌర్యకు భలేగా నచ్చింది. ఎంత నచ్చిందంటే… చివరికి ఈ సినిమాను తానే ప్రొడ్యూస్ చేయాలని కూడా డిసైడ్ అయ్యాడంటే.. నాగశౌర్య నమ్మకం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తనకు బాగా కలిసొచ్చిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లోనే ఈ సినిమా ఉండబోతోంది. త్వరలోనే మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి.