నాగశౌర్య 'కణం' రిలీజ్ డేట్

Friday,December 15,2017 - 06:47 by Z_CLU

ఓవైపు తన సొంత బ్యానర్ లో ఛలో సినిమా చేస్తూనే మరోవైపు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన కణం అనే సినిమాలో కూాడా నటించాడు నాగశౌర్య. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసి ఫిబ్రవరి 9న కణం సినిమాను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

గతంలో విక్రమ్ ను హీరోగా పెట్టి నాన్న లాంటి డిఫరెంట్ మూవీని డైరక్ట్ చేసిన ఏఎల్ విజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ సాయిపల్లవి ఇందులో హీరోయిన్ గా నటించింది. ఇప్పటివరకు రొమాంటిక్ యాంగిల్ లోనే కనిపించిన సాయిపల్లవి.. కణంలో సరికొత్త కోణంలో కనిపించనుంది.

తెలుగు, తమిళ ఈ సినిమాను ఒకేసారి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు సి.శామ్ మ్యూజిక్ అందించాడు.