నాగశౌర్య అప్ కమింగ్ మూవీస్ ఇవే

Thursday,July 11,2019 - 10:40 by Z_CLU

తన అప్ కమింగ్ మూవీస్ పై నాగశౌర్య క్లారిటీ ఇచ్చాడు. మొన్నటివరకు తన సినిమాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేశాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు… త్వరలోనే సెట్స్ పైకి రానున్న సినిమాల్ని వరుసగా ఎనౌన్స్ చేశాడు శౌర్య.

ప్రస్తుతం రమణతేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. దీనికి అశ్వద్ధామ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ కూడా నాగశౌర్యే అందించాడు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి మూడో షెడ్యూల్ హైదరాబాద్ లో నడుస్తోంది.

ఈ సినిమాతో పాటు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు శౌర్య. ఈ మూవీకి ఫలానా అబ్బాయ్-ఫలానా అమ్మాయి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీలో నాగశౌర్య 7 డిఫరెంట్ గెటప్స్ లో
కనిపించబోతున్నాడు. సినిమాకు సంబంధించి ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.

ఈ రెండు సినిమాలతో పాటు.. సుబ్రమణ్యపురం దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు నాగశౌర్య. ఈ సినిమాకు పార్థు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే ఇది సెట్స్ పైకి రాబోతోంది.