నాగశౌర్య, సాయిపల్లవి జంటగా వస్తున్న 'కణం'

Monday,September 04,2017 - 03:06 by Z_CLU

యంగ్ హీరో నాగశౌర్య, ఫిదా ఫేమ్ సాయిపల్లవి జంటగా విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ‘కణం’.. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

రజిని కాంత్ -శంకర్ ల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ గా తెరకెక్కుతున్న సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు 2.0 సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న నిరవ్‌షా ఈ చిత్రానికి పనిచేయడం విశేషం.. తమిళ్,తెలుగు భాషల్లో బై లింగ్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో అక్టోబర్ లో సందడి చేయబోతుంది ఈ జంట..