నాగ శౌర్య కి హీరోయిన్ ఫిక్స్

Sunday,March 25,2018 - 12:10 by Z_CLU

‘ఛలో’ సూపర్ హిట్ తరువాత నాగశౌర్య నటిస్తున్న ‘నర్తన శాల’ సినిమా ఏప్రిల్ 12 నుండి సెట్స్ పైకి రానుంది. డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ఫాస్ట్ ఫేజ్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. లేటెస్ట్ గా ఈ సినిమాలో నాగ శౌర్య సరసన మేహ్రీన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసారు మేకర్స్.

ప్రస్తుతం గోపి చంద్ సరసన ‘పంతం’ సినిమాలో నటిస్తున్న మేహ్రీన్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననుంది.  ‘ఛలో’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాగర్ మహతి ఈ సినిమాకి కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఐరా క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమాతో శ్రీనివాస్ చక్రవర్తి  గా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.