సూపర్ హిట్ కాంబో...మళ్ళీ రెడీ

Sunday,October 14,2018 - 10:02 by Z_CLU

ఈ ఏడాది సూపర్ హిట్స్ లో ‘ఛలో’ ఒకటి… చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ గా నిలిచిన ఈ సినిమాతో సూపర్ హిట్ జోడి అనిపించుకున్నారు నాగ శౌర్య – రష్మిక… ప్రస్తుతం మళ్ళీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది ఈ కాంబో. ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్లో త్వరలోనే ఓ సినిమా సెట్స్ పైకి రానుంది. కొన్నేళ్ళుగా సుకుమార్ దగ్గర శిష్యరికం చేస్తున్న కాశీ విశాల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.. ఈ సినిమాకు హీరో హీరోయిన్స్ గా నాగ శౌర్య -రష్మిక ను ఫైనల్ చేసుకున్నారు మేకర్స్.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ లవ్ ఎంటర్టైనర్ సినిమా నవంబర్ లో గ్రాండ్ గా లాంచ్ కానుంది.. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.