ఆ సినిమాను మొదలు పెట్టనున్న యంగ్ హీరో!
Thursday,July 23,2020 - 02:18 by Z_CLU
దాదాపు ఐదు నెలలుగా షూటింగ్ లు లేక ఇంటికి పరిమితమైన యంగ్ హీరోలు ఒక్కొక్కరు షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. నాగశౌర్య తన అప్ కమింగ్ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.
‘సుబ్రహ్మణ్యపురం’ ఫేం సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేయబోతున్న శౌర్య ఆ సినిమా షూటింగ్ ను ఆగస్ట్ నుండి మొదలు పెట్టనున్నాడని సమాచారం. మొదటి షెడ్యుల్ కోసం ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని లోకేషన్స్ ఎంచుకున్నారు.
ఆర్చెరీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. శరత్ మరార్ , సునీల్ నారంగ్ , రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.