కొత్త సినిమా లాంఛ్ చేసిన నాగశౌర్య

Thursday,February 13,2020 - 01:04 by Z_CLU

అశ్వథ్థామ సక్సెస్ తో మళ్లీ ట్రాక్ పైకొచ్చాడు నాగశౌర్య. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. నాగశౌర్య, రీతూవర్మ హీరోహీరోయిన్లుగా కొత్త సినిమా ఈరోజు లాంఛ్ అయింది.

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కాబోతోంది. ఈరోజు ఉదయం 10.08 నిమిషాలకు ఫిలింనగర్ లోని సితార ఆఫీస్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.

ఇంకా పేరు పెట్టని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఈనెల 19 నుంచి ప్రారంభిస్తారు. సినిమాకు సంబంధించి క్యారెక్టర్ ఆర్టిస్టుల సెలక్షన్ ఇంకా పూర్తికాలేదు.

టెక్నీషియన్స్
నిర్మాత: సూర్య దేవర నాగవంశి
బ్యానర్ : సితార ఎంటర్ టైన్ మెంట్స్
సినిమాటోగ్రఫీ: వంశి పచ్చి పులుసు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
దర్శకత్వం: లక్ష్మీసౌజన్య