మరో సినిమా ఫైనల్ చేసుకున్న నాగ శౌర్య

Sunday,May 12,2019 - 11:16 by Z_CLU

సొంత బ్యానర్లో రమణ తేజ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు నాగ శౌర్య. రేపటి నుండి వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేసేసుకున్నాడు శౌర్య. ‘సుబ్రహ్మణ్యపురం’ దర్శకుడు సంతోష్ జాగర్లపూడితో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించనున్నాడు.

సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.  ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను త్వరలోనే లాంఛనంగా ప్రారంభించనున్నారు.  ఈ రెండు సినిమాలతో శౌర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని మళ్ళీ హిట్ ట్రాక్ లోకోస్తాదేమో..చూడాలి.