జనవరి నుండి నాగ శౌర్య కొత్త సినిమా

Sunday,December 16,2018 - 02:05 by Z_CLU

ప్రస్తుతం రాజు అనే డెబ్యూ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు నాగ శౌర్య.. ఈ సినిమా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజిలో ఉంది. ఈ సినిమాతో పాటు నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత నటిస్తున్న సినిమాలో కూడా స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడు శౌర్య. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. సుకుమార్ శిష్యుడు రంగస్థలం రచయితల్లో ఒకడైన కాశి విశాల్ డైరెక్షన్ లో నాగ శౌర్య నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమాలో నాగ శౌర్య సరసన నిధి అగర్వాల్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసుకున్నారు మేకర్స్. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. డిసెంబర్ లో గ్రాండ్ లాంచ్ కానున్న ఈ సినిమా జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.