నాగశౌర్య నెక్స్ట్ సినిమా బిగిన్ అయింది

Monday,April 10,2017 - 05:08 by Z_CLU

వెంకి కుడుముల డైరెక్షన్ లో నాగశౌర్య నెక్స్ట్ సినిమా బిగిన్ అయింది. ఈ సినిమాతో రష్మిక మండన్న తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ కానుంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన ఈ సినిమాకి నారా రోహిత్ క్లాప్ కొట్టాడు. అల్టిమేట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఏప్రిల్ లాస్ట్ వీక్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై తన నాగశౌర్య సొంత ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సాగర్ మహతి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. నాగశౌర్య కరియర్ లో బెస్ట్ ఎంటర్ టైనర్స్ లా నిలిచిపోయిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘లక్ష్మీ రావే మ ఇంటికి’ ‘కళ్యాణ వైభోగమే’ లాంటి బెస్ట్ ఎంటర్ టైనర్స్ లా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్. ఈ సినిమాలో నాగశౌర్య కాలేజీ స్టూడెంట్ గా కనిపించనున్నాడు.