నాగశౌర్య ఇంటర్వ్యూ

Tuesday,August 28,2018 - 05:17 by Z_CLU

నాగశౌర్య ‘నర్తనశాల’ ఈ నెల 30 న రిలీజవుతుంది. ఫ్రెష్ కంటెంట్ ఉన్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ తో కరియర్ ప్లాన్ చేసుకుంటున్న నాగశౌర్య ఈ సినిమా గురించి మీడియాతో చాలా విషయాలు చెప్పుకున్నాడు అవి మీకోసం…

కథ నచ్చింది అందుకే…

శ్రీనివాస్ చక్రవర్తి డెబ్యూ డైరెక్టరే అయినా కథ చెప్పినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆడియెన్స్ కూడా డెఫ్ఫినేట్ గా ఎంజాయ్ చేస్తారనే ఈ సినిమా చేశాను.

సెంటిమెంట్ కాబట్టే…

సినిమాకి ‘నర్తనశాల’ టైటిల్ అనుకుంటున్నప్పుడు ఈ టైటిల్ పెట్టుకుని స్టార్ట్ అయిన చాలా సినిమాలు ఆగిపోయాయని నాన్నగారు చెప్పడంతో దానికి @ చేర్చాం. అలా అది @నర్తనశాల అయింది.

అదే నా క్యారెక్టర్…

విమెన్ ఎంపవర్ మెంట్ ని సపోర్ట్ చేసే క్యారెక్టర్ నాది ఈ సినిమాలో. కొంతమంది అమ్మాయిలూ నలుగురిలోకి వెళ్ళడానికే భయపడుతుంటారు. వాళ్ళ గతాన్ని తలుచుకుంటూ అలాగే కుమిలిపోతూ బ్రతికేస్తుంటారు. అలాంటి వాళ్ళకు ధైర్యం చెప్పి ఎంకరేజ్ చేస్తుంటా…

సినిమా చూడాల్సిందే…

సినిమాలో నా రోల్ నిజంగా ‘గే’ నా కాదా…? అసలీ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

చాలా స్ట్రెస్ ఉంటుంది…

నా సొంత ప్రొడక్షన్ లో పని చేయడానికి, బయట ప్రొడక్షన్ లో చేయడానికి చాలా డిఫెరెన్స్ ఉంటుంది. సొంత ప్రొడక్షన్ లో చేసేటప్పుడు చాలా స్ట్రెస్ ఉంటుంది.

అమ్మే ఫస్ట్ క్రిటిక్…

నా సినిమాల విషయంలో నాకు అమ్మే ఫస్ట్ క్రిటిక్. సినిమా తనకు నచ్చిందంటే అనుమానం లేదు అందరికీ నచ్చుతుంది. నచ్చలేదు అంటే ఇంకా అంతే సంగతులు.

అందుకే వెయిట్ తగ్గుతున్నా…

ఐరా క్రియేషన్స్ లో ఇంకో సినిమా ప్రిపరేషన్స్ లో ఉన్నా… రమణ తేజ అని డెబ్యూ డైరెక్టర్. ఈ ఇస్నిమా కోసం వెయిట్ తగ్గాల్సి వస్తుంది. పస్తుతం ఆ పనిలోనే ఉన్నా.. ఈ సినిమాతో పాటు భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో రాజా కొలుసు డైరెక్షన్ లో ఇంకో సినిమా చేస్తున్నా…

అందుకే డెబ్యూ డైరెక్టర్స్…

కొత్త డైరెక్టర్స్ మంచి స్టోరీస్ తో వస్తున్నారు. అవి నచ్చేస్తున్నాయి అందుకే డెబ్యూ డైరెక్టర్స్ తో చేస్తున్నా…

నో మల్టీస్టారర్స్…  

మల్టీస్టారర్స్ అసలు చేయాలని లేదు. ఇప్పటి వరకు ఒక రోహిత్ తో మల్టీస్టారర్ చేశాను కానీ, ఇకపై చేయను.