సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘ఛలో’ ట్రైలర్

Friday,January 19,2018 - 01:15 by Z_CLU

నాగశౌర్య హీరోగా నటిస్తున్న ‘చలో’ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.  ఆంధ్రా, తమిళనాడు బార్డర్ లో జరిగే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమా, మూవీ లవర్స్ ని ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయింది.

రీసెంట్ గా రిలీజైన 2 సాంగ్స్, సినిమాపై కాన్సంట్రేషన్ ని సెట్ చేస్తే, ఈ ట్రైలర్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తుంది. ఉషా, శంకర ప్రసాద్ ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో పాటు, ఈ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతున్న రష్మిక మండన్న ఫ్రెష్ లుక్స్ సినిమాకి పెద్ద ఎసెట్ కానున్నాయి.

వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మహతి సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. సీనియర్ నరేష్, పోసాని, రఘుబాబు ఈ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.