రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకున్న నాగశౌర్య ‘చలో’

Friday,December 08,2017 - 05:25 by Z_CLU

నాగశౌర్య ‘చలో’ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఆంధ్రా, తమిళనాడు బార్డర్ లో జరిగే ఈ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ యూత్ ని ఎట్రాక్ట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. అయితే డిసెంబర్ 29 న రిలీజ్ కావాల్సిన యూత్ ఫుల్ ఫుల్ ఎంటర్ టైనర్ ఫిబ్రవరి 2 కి పోస్ట్ పోన్ అయింది. అయితే అదే రోజు రిలీజ్ కానున్న సునీల్ ‘2 కంట్రీస్’ మాత్రం ముందు అనౌన్స్ చేసినట్టు డిసెంబర్ 29 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.

సునీల్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన 2 కంట్రీస్ కూడా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది. మళయాళ బ్లాక్ బస్టర్ ‘2 కంట్రీస్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా మ్యాగ్జిమం U.S. లోని ఎగ్జోటిక్ లొకేషన్ లలో షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో నరేష్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.

 

2 కంట్రీస్ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. మనీషా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.