ఛలో 5 రోజుల వసూళ్లు
Thursday,February 08,2018 - 04:03 by Z_CLU
నాగశౌర్య, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన ఛలో సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. విడుదలైన 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఈ వీకెండ్ మరిన్ని వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది. వెంకీ కుడుముల డైరక్ట్ చేసిన ఈ సినిమాకు 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ చూద్దాం.
నైజాం – రూ. 1.70 కోట్లు
సీడెడ్ – రూ. 0.55 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.70 కోట్లు
ఈస్ట్ – రూ. 0.43 కోట్లు
వెస్ట్ – రూ. 0.30 కోట్లు
గుంటూరు – రూ. 0.44 కోట్లు
కృష్ణా – రూ. 0.49 కోట్లు
నెల్లూరు – రూ. 0.19 కోట్లు
మొత్తం షేర్ – రూ. 4.8 కోట్లు