Naga Shaurya LAKSHYA - షూటింగ్ అప్ డేట్స్
Sunday,July 11,2021 - 09:21 by Z_CLU
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రాచీన విలువిద్య నేపథ్యంలో వస్తున్న సినిమా ‘లక్ష్య’. కెరీర్ లో నాగశౌర్యకు ఇది 20వ సినిమా. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్తలుక్‌లో కనిపించనున్నారు నాగశౌర్య.

సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్రలలో విలక్షణ నటులు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ నటిస్తున్నారు.
ఈ చిత్రంలోని కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. నాగశౌర్యతో పాటు, జగపతి బాబు ఇతరనటులు ఈ షూట్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా విడుదలచేసిన మేకింగ్ వీడియోలో నాగశౌర్య తన లక్ష్యాన్నిఛేదించడానికి సిద్దమవడం మనం చూడొచ్చు. ఫైనల్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి, ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics