రేపే నాగ‌శౌర్య `అశ్వ‌థ్థామ‌` టీజ‌ర్‌

Thursday,December 26,2019 - 12:30 by Z_CLU

నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అశ్వ‌థ్థామ‌`. ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా టీజర్ ను రేపు రిలీజ్ చేయబోతున్నారు.

ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉంది. జ‌న‌వ‌రి 31న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. సినిమా హీరో నాగ‌శౌర్య‌నే ఈ సినిమాకు క‌థ‌ను అందించాడు. ఈ సినిమాను నాగ‌శౌర్య ఎంతో ప్రేమించి ప్యాష‌నేట్‌గా రూపొందిస్తున్నారు. అందుక‌నే ఈ సినిమా టైటిల్‌ను ఛాతీపై ప‌చ్చ‌బొట్టుగా వేయించుకున్నారు కూడా.

న‌టీన‌టులు:
నాగ‌శౌర్య‌, మెహ‌రీన్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌: ఐరా క్రియేష‌న్స్‌
నిర్మాత‌: ఉషా ముల్పూరి
క‌థ‌: నాగ‌శౌర్య‌
ద‌ర్శ‌క‌త్వం: ర‌మ‌ణ‌తేజ‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌నోజ్ రెడ్డి
సంగీతం: శ్రీచ‌ర‌ణ్ పాకాల‌
ఎడిట‌ర్‌: గ్యారీ బి.హెచ్
లైన్ ప్రొడ్యూస‌ర్‌: బుజ్జి
డిజిట‌ల్‌: ఎంఎన్ఎస్ గౌత‌మ్‌
డైలాగ్స్‌: ప‌రుశురాం శ్రీనివాస్‌
యాక్ష‌న్‌: అన్బ‌రివు
కొరియోగ్రాఫ‌ర్‌: విశ్వ ర‌ఘు