NagaShaurya-RituVarma - వరుడు కావలెను

Saturday,November 14,2020 - 10:23 by Z_CLU

‘వరుడు కావలెను‘….!
వినగానే ఇది తమ అమ్మాయికి తగిన ‘వరుడు‘ కోసం ‘వధువు‘ తల్లి దండ్రులు పత్రికలలో ఇచ్చే ప్రకటన అనిపిస్తుంది. కానీ ఇది సినిమా పేరు.

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , హీరోయిన్ ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రానికి ‘వరుడు కావలెను‘ అనే పేరును నిర్ణయించారు.

ఈ వీడియో లో నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తెచ్చింది. ఇదొక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

ఇక షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే.. హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. హీరోహీరోయిన్లపై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.

టెక్నీషియన్స్
మాటలు: గణేష్ రావూరి
ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య