మూడు నిమిషాల సీన్స్ ...నో కట్ !

Thursday,August 01,2019 - 10:02 by Z_CLU

ప్రస్తుతం రమణ తేజ అనే డెబ్యూ డైరెక్టర్ తో సొంత బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు నాగ శౌర్య. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ‘కేజీఎఫ్ ‘ ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్ట‌ర్స్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫిలో కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు.

ఇదే షెడ్యుల్ లో క‌ట్ లేకుండా మూడు నిమిషాల నిడివిగ‌ల స‌న్నివేశాల్ని కూడా చిత్రీకరించనున్నారు. ఈ సీన్స్ లో  నాగ శౌర్య సింగిల్ టేక్ డైలాగ్స్ తో మెస్మరైజ్ చేయబోతున్నాడు. 

శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతున్న ‘అశ్వద్ధామ’అనే టైటిల్ ఖరారు చేసారు. త్వరలోనే టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు.