LAKSHYA - షూటింగ్ అప్ డేట్స్

Monday,January 04,2021 - 10:06 by Z_CLU

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ల‌క్ష్య`. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై ప్ర‌ముఖ నిర్మాత‌లు నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర‌లో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. నాగ‌శౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.

Naga-Shaurya-LAKSHYA-movie-shooting-update

ఇప్ప‌టికే 70% షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా చివ‌రి షెడ్యూల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ మూవీ నుండి ఇప్ప‌టికే విడుద‌ల‌చేసిన స్ట‌న్నింగ్‌ ఫస్ట్‌లుక్ అంద‌రినీ థ్రిల్ చేసింది. కాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాను సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం సంతోష్‌ జాగర్లపూడి. కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.