రెండూ ఒకేసారి

Thursday,February 23,2017 - 07:36 by Z_CLU

ఫుల్ టూ లోడెడ్ ఎగ్జైట్ మెంట్ లో ఉన్నాడు నాగచైతన్య. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉన్న చైతు ఏ మాత్రం గ్యాప్ దొరికినా, టైం వేస్ట్ చేయకుండా, ఇంకో సినిమా షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఓ వైపు కళ్యాణ్ కృష్ణతో సినిమా చేస్తూనే మరో వైపు రీసెంట్ గా లాంచ్ అయిన కృష్ణం ముత్తు సినిమా సెట్స్ పైకి వచ్చేశాడు.

లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. గతంలో నాగార్జున సరసన నటించిన లావణ్య, చైతు సినిమాలోను హీరోయిన్ అనగానే ఆటోమేటిక్ గా ఈ సినిమాపై స్పెషల్ ఇంటరెస్ట్ సెట్ అయిపోయింది. ఎగ్జాక్ట్ గా ఈ సినిమా యూనిట్ సెట్స్ పై కసరత్తులు చేస్తున్న కాన్సెప్ట్ డీటేల్స్ అయితే పెద్దగా తెలీదు కానీ, ఈ సినిమా మాత్రం ఇప్పటి నుండే కాన్సంట్రేషన్ ని గ్యాదర్ చేస్తుంది.

 

ఫ్యాన్స్ నాగచైతన్య నుండి  ఎక్స్ పెక్ట్ చేసినట్టు రొమాంటిక్ షేడ్స్ ని మెయిన్ టైన్ చేస్తూనే అటు యాక్షన్ ఎలిమెంట్స్ పై కూడా ఫోకస్  పెడుతున్న నాగచైతన్య, 2017 లో బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ తో మెస్మరైజ్ చేసే చాన్సెస్ బోలెడు కనిపిస్తున్నాయి.