Naga Chaitanya 'థాంక్యూ' రిలీజ్ డేట్ ఫిక్స్

Saturday,May 14,2022 - 02:14 by Z_CLU

Naga Chaitanya’s ‘Thank You’ Release date locked

‘మనం’ లాంటి ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ తరువాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌కుమార్‌ల కలయికలో రాబోతున్న ‘థాంక్యూ’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్సయింది. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాల నిర్మాణ సంస్థ శ్రీవెంకటేళ్వర క్రియేషన్స్‌ బేనర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, మాళవిక నాయర్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.  రిలీజ్ డేట్ తో విడుదల చేసిన పోస్టర్‌లో నాగచైతన్య కూల్‌అం‌డ్‌ స్టయిలిష్‌ లుక్‌  అందరిని ఆకట్టుకుంటుంది.  ‘నాగచైతన్య కెరీర్‌లో ఇదో మెమొరబుల్ సినిమాగా నిలిచిపోతుందని మేకర్స్ గట్టిగా చెప్తున్నారు.  లెజండరీ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్న ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. బీవీఎస్‌ రవి కథను అందించగా నవీన్‌ నూలి ఎడిటర్. సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ త్వరలోనే రానున్నాయి.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics